యాసిడ్ దాడితో అంధత్వం.. పదిలో 95% మార్కులతో విద్యార్థిని సత్తా
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండాలే కానీ అందుకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించింది చండీగఢ్‌కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని కాఫీ.
లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉండాలే కానీ అందుకు అంగవైకల్యం అడ్డు కాదని నిరూపించింది చండీగఢ్‌కు చెందిన 15 ఏళ్ల విద్యార్థిని కాఫీ. యాసిడ్ దాడికి గురై చూపు కోల్పోయినా.. చదువుపై మక్కువతో సీబీఎస్‌ఈ 10వ తరగతి పరీక్షల్లో 95.2 శాతం మార్కులు సాధించి స్కూల్ టాపర్‌గా నిలిచింది. ‘‘నా కుమార్తెకు 3 ఏళ్లు ఉన్నప్పుడు పక్కింటి వ్యక్తి తనపై యాసిడ్ దాడి చేయడంతో చూపు కోల్పోయింది. ఆరేళ్లపాటు ఎన్నో ఆస్పత్రులకు తీసుకెళ్లి చూపించినా ఫలితం దక్కలేదు. తాను ఐఏఎస్ కావాలనుకుంటోంది. పిల్లలు తమ లక్ష్యాన్ని చేరుకునేందుకు తల్లిదండ్రులు పూర్తి సహకారం అందించాలి’’ అని సచివాలయంలో ప్యూన్‌గా పనిచేస్తున్న కాఫీ తండ్రి పవన్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/10/2023)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్