జనరిక్ మందులనే రాయండి.. లేదంటే చర్యలు తప్పవు
కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులు.. తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మందులనే రాయలని(ప్రిస్క్రైబ్ చేయాలని) కేంద్రం సూచించింది.
కేంద్రప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు కేంద్రం హెచ్చరిక
దిల్లీ: కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రులు, సీజీహెచ్‌ఎస్ వెల్‌నెస్ కేంద్రాల్లోని వైద్యులు.. తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ మందులనే రాయలని(ప్రిస్క్రైబ్ చేయాలని) కేంద్రం సూచించింది. దీనికి భిన్నంగా వ్యవహరించే డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అలాగే ఆసుపత్రుల ప్రాంగణాలకు మెడికల్ రిప్రజెంటేటివ్‌ల రాకపోకలను పూర్తిగా తగ్గించేలా చూడాలని కోరింది. ఈ మేరకు వైద్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ అతుల్ గోయల్ ఈ నెల 12న అధికారిక ఆదేశాలు జారీ చేశారు. కొందరు వైద్యులు రోగులకు జనరిక్ మందులకు బదులు బ్రాండెడ్ మందులు రాస్తున్న దృష్టాంతాల నేపథ్యంలో ఈ పరిస్థితిని నివారించేందుకు ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్