ప్రధాని అత్తగారినంటే నమ్మలేదు.. సుధామూర్తి వ్యాఖ్య

ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగానే గాక.. రచయిత్రి, వితరణశీలిగా సుధామూర్తి ఎంతో మందికి సుపరిచితురాలు.

Published : 16 May 2023 05:21 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి సతీమణిగానే గాక.. రచయిత్రి, వితరణశీలిగా సుధామూర్తి ఎంతో మందికి సుపరిచితురాలు. ఇటీవల ఆమె ప్రముఖ బాలీవుడ్‌ టాక్‌ షో ‘ది కపిల్‌ శర్మ షో’లో పాల్గొని.. తన వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తన వస్త్రధారణ కారణంగా లండన్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని ఆమె బయటపెట్టారు. ‘‘ఇటీవలే నేను యూకే వెళ్లాను. అక్కడ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు లండన్‌లో ఎక్కడ ఉంటారు? అని ప్రశ్నించారు. నా కుమారుడు యూకేలోనే ఉంటాడు. కానీ అతడి పూర్తి అడ్రసు నాకు తెలియదు. దీంతో నేను నా అల్లుడు రిషి సునాక్‌ నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌ను అడ్రస్‌గా రాశాను. అది చూడగానే ఇమ్మిగ్రేషన్‌ అధికారి నన్ను ఎగాదిగా చూసి.. ‘జోక్‌ చేస్తున్నారా?’ అని అడిగారు. నేను నిజమే అని చెప్పినా వారు నమ్మినట్లు నాకు అన్పించలేదు. నాలాంటి సింపుల్‌ మహిళ ప్రధాని అత్తగారంటే అక్కడ ఎవరూ నమ్మలేదు’’ అని నాటి సంఘటనను సుధామూర్తి గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని