Madhya pradesh: ఏడాది బిడ్డను సీఎం వేదికపైకి విసిరేసిన తండ్రి!

ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య అక్కడున్న అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరిన అతడి తీరుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated : 17 May 2023 08:57 IST

ముఖ్యమంత్రి దృష్టిలో పడేందుకు ఓ తండ్రి చేసిన చర్య అక్కడున్న అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఏడాది బిడ్డను వేదికపైకి విసిరిన అతడి తీరుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఆ కన్నతండ్రి ప్రవర్తన వెనుక గల కారణం తెలిసి సీఎం సహా అందరి హృదయం ద్రవించింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ముకేశ్‌ పటేల్‌, నేహ భార్యాభర్తలు. ముకేశ్‌ దినసరి కూలీ. ఈ జంటకు ఓ కుమారుడు (1) ఉన్నాడు.

ఆ చిన్నారికి మూడు నెలల వయసున్నప్పుడు గుండెలో రంధ్రం ఉందని వైద్యులు గుర్తించారు. అప్పటినుంచి వైద్యం కోసం స్తోమతకు మించి రూ.4 లక్షల వరకు ఖర్చు చేశారు. శస్త్రచికిత్సకు మరో రూ.3.50 లక్షలు కావాలన్నారు. ఆ డబ్బు ఎలా సమకూర్చుకోవాలో వారికి అర్థం కాలేదు. అప్పుడే సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. సాగర్‌ ప్రాంతంలో జరిగిన ఓ సభకు వచ్చారు. అక్కడికి ముకేశ్‌, నేహా కూడా వెళ్లారు. ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లడం వారికి సాధ్యపడలేదు. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన ముకేశ్‌ విపరీత చర్యకు పాల్పడ్డాడు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా బిడ్డను వేదికపైకి విసిరేశాడు. భద్రతా సిబ్బంది బాబును కాపాడి, తల్లికి అప్పగించారు. మొదట విస్తుపోయినా.. చిన్నారి సమస్యను తెలుసుకున్న సీఎం బాబుకు వైద్యసహాయం అందించాలని స్థానిక కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని