జీ-7 సమావేశాలకు మోదీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ నుంచి 24 వరకు 3 దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 19వ తేదీన జపాన్‌కు వెళ్తారు.

Updated : 17 May 2023 05:42 IST

19 నుంచి జపాన్‌ వేదికగా నిర్వహణ
బైడెన్‌ సహా కీలక దేశాధినేతల రాక

దిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19వ తేదీ నుంచి 24 వరకు 3 దేశాల పర్యటనకు వెళ్తున్నారు. మే 19వ తేదీన జపాన్‌కు వెళ్తారు. 21వ తేదీ వరకూ హిరోషిమాలో జరిగే జీ-7 సమావేశాల్లో పాల్గొంటారు. ఈ సమావేశాల్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఇతర కీలక దేశాధినేతలు పాల్గొంటున్నారు. శాంతి, స్థిరత్వం, సమగ్రత, ఆహారం, ఇంధనం, భద్రత వంటి అంశాలపై వారు చర్చిస్తారు. జపాన్‌ నుంచి పపువా న్యూగినియాలోని పోర్టు మోర్సిబై వెళ్లి అక్కడ 22వ తేదీన జరిగే ఇండియా, పసిఫిక్‌ ద్వీపాల సహకార ఫోరం సమావేశంలో పాల్గొంటారు. 22 నుంచి 24 వరకూ ఆస్ట్రేలియాలోని సిడ్నీలో జరిగే క్వాడ్‌ సమ్మిట్‌కు మోదీ హాజరవుతారు. ఈ సమ్మిట్‌కు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌ అధ్యక్షత వహిస్తారు. జో బైడెన్‌, జపాన్‌ ప్రధాని కిషిద పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు