ఏపీలో 50 వేల అనుమానిత సిమ్‌ కార్డులు

దేశవ్యాప్తంగా 40.87 లక్షల అనుమానాస్పద సిమ్‌లు ఉన్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ వెల్లడించింది.

Updated : 17 May 2023 05:41 IST

ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా 40.87 లక్షల అనుమానాస్పద సిమ్‌లు ఉన్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ వెల్లడించింది. 87.15 కోట్ల సిమ్‌లను కృత్రిమ మేథ ద్వారా విశ్లేషించి ఈ లెక్క తేల్చింది. ఇందులో 36.61 లక్షల సిమ్‌లను డిస్‌కనెక్ట్‌ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో 5.06 కోట్ల సిమ్‌లను విశ్లేషించి 50,825 అనుమానాస్పదంగా ఉన్నట్లు తేల్చింది. అందులో 47,938 సిమ్‌లను డిస్‌కనెక్ట్‌ చేసింది. 72 పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) కేంద్రాలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. పశ్చిమబెంగాల్‌లో అత్యధికంగా 12,59,432 అనుమానాస్పద సిమ్‌లు ఉన్నట్లు గుర్తించింది. అందులో 12,34,111లను డియాక్టివేట్‌ చేసింది. 10,915 పీఓఎస్‌లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. పశ్చిమబెంగాల్‌ తర్వాత హరియాణా, బిహార్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ (తూర్పు), గుజరాత్‌, అస్సాం, కోల్‌కతా, పంజాబ్‌, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర్‌ప్రదేశ్‌ (పశ్చిమ), ఉత్తరాఖండ్‌, ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, దిల్లీ, కర్ణాటక, మహారాష్ట్రల్లో అత్యధిక అనుమానాస్పద సిమ్‌లు వెలుగు చూసినట్లు కమ్యూనికేషన్ల శాఖ తెలిపింది. అత్యల్ప అనుమాన్పాద సిమ్‌లు ఉన్న ప్రాంతాల్లో జమ్మూకశ్మీర్‌ (15,194), కేరళ (9,802), హిమాచల్‌ప్రదేశ్‌ (3,964) ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని