31 నుంచి రాహుల్‌ అమెరికా పర్యటన

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 31 నుంచి పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం.

Updated : 17 May 2023 05:36 IST

దిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ ఈ నెల 31 నుంచి పది రోజులపాటు అమెరికాలో పర్యటించనున్నట్లు సమాచారం. జూన్‌ 4న న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. వాషింగ్టన్‌, కాలిఫోర్నియాలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీ విద్యార్థులతోనూ ముచ్చటించనున్నారు. వీటితోపాటు అనేక మంది రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలతోనూ రాహుల్‌ భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు