అభివృద్ధి పనుల కోసం తండ్రి సమాధినే తొలగించిన నవీన్‌ పట్నాయక్‌

అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిత్యం తపిస్తుంటారని, గతంలో పూరీలో అభివృద్ధి పనుల కోసం తన తండ్రి బిజు పట్నాయక్‌ (బిజుబాబు) సమాధిని తొలగింపజేశారని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన 5టి కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తెలిపారు.

Updated : 18 May 2023 06:01 IST

ఒడిశా దివస్‌లో ఆ రాష్ట్ర అధికారి వెల్లడి

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: అభివృద్ధి పనుల కోసం ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నిత్యం తపిస్తుంటారని, గతంలో పూరీలో అభివృద్ధి పనుల కోసం తన తండ్రి బిజు పట్నాయక్‌ (బిజుబాబు) సమాధిని తొలగింపజేశారని రాష్ట్రంలో ప్రత్యేకంగా ఏర్పాటైన 5టి కార్యదర్శి వి.కార్తికేయ పాండ్యన్‌ తెలిపారు. దుబాయ్‌లో బుధవారం నిర్వహించిన ఒడిశా దివస్‌ వేడుకల్లో పాండ్యన్‌ ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజాహితం కోసం నవీన్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంటారన్నారు. పూరీ మహా ప్రస్థానం ఆధునికీకరణ పనుల్లో భాగంగా కొన్నేళ్ల క్రితం బిజుబాబు సమాధిని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు