New Cities: దేశంలో కొత్తగా 8 నగరాలు.. ఏర్పాటుకు కేంద్రం యోచన
దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పట్టణ కేంద్రాలపై నానాటికీ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.

ఇందౌర్: దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పట్టణ కేంద్రాలపై నానాటికీ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు కొత్త నగరాలను అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.
మధ్యప్రదేశ్ ఇందౌర్‌లో గురువారం ‘అర్బన్ 20’ సమావేశం తర్వాత కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ శాఖ జీ20 యూనిట్ డైరెక్టర్ ఎంబీ సింగ్ మీడియాతో మాట్లాడారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసిందని తెలిపారు. ‘‘ఆర్థిక సంఘం సిఫార్సు తర్వాత.. పలు రాష్ట్రాలు 26 కొత్త నగరాల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఆ తర్వాత ఎనిమిది కొత్త నగరాల ఏర్పాటు అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు’’ అని ఎంబీ సింగ్ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nijjar killing: నిజ్జర్ హత్య వెనుక పాక్ ఐఎస్ఐ..!
-
S Jaishankar: అసాధారణ స్థితిలో భారత్- చైనా బంధం: జై శంకర్
-
Assam: మైనర్ బాలికకు నరకం.. ఆర్మీ అధికారి దంపతుల దాష్టీకం
-
TS High Court: గ్రూప్-1 ప్రిలిమ్స్ రద్దు సబబే: హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు
-
Nayanthara: మలేసియా వీధుల్లో నయన్ కుటుంబం సందడి..
-
PM Modi: ప్రపంచ ఆర్థికాభివృద్ధి కేంద్రంగా భారత్.. అదే మా లక్ష్యం: ప్రధాని మోదీ