జీ-20 సదస్సుకు ఉగ్ర బెదిరింపులు

జమ్మూకశ్మీర్‌లో 22 నుంచి 24 వరకు జరగనున్న జీ-20 సదస్సును భగ్నం చేస్తామంటూ ఉగ్రవాదుల బెదిరింపు నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.

Published : 19 May 2023 05:25 IST

జమ్మూకశ్మీర్‌లో 22 నుంచి 24 వరకు జరగనున్న జీ-20 సదస్సును భగ్నం చేస్తామంటూ ఉగ్రవాదుల బెదిరింపు నేపథ్యంలో శ్రీనగర్‌లో భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు. మెరైన్‌ కమెండోలను పెద్దఎత్తున మోహరించారు. గురువారం లాల్‌చౌక్‌ ప్రాంతంలో విస్తృతంగా భద్రతా తనిఖీలు జరిగాయి. అంతర్జాతీయ మొబైల్‌ నంబర్ల నుంచి స్థానికులు కొందరికి అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, వాట్సాప్‌ సందేశాలు రావడంతో పోలీసులు సూచనలు జారీ చేశారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌-370ను తొలగించిన తర్వాత అక్కడి పరిస్థితి గణనీయంగా మెరుగుపడిందని ప్రపంచానికి చాటేందుకు, పూర్వ పర్యాటక వైభవ పునరుద్ధరణకు ఇక్కడ సదస్సు నిర్వహించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. ప్రసిద్ధ దాల్‌ సరస్సు ఒడ్డున ఉన్న షేర్‌ - ఏ - కశ్మీర్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ సెంటర్‌లో ఈ సదస్సు జరగనుంది. కశ్మీర్‌ పర్యాటక, వాణిజ్యరంగాలపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. శ్రీనగర్‌లో జీ-20 సదస్సు నిర్వహించవద్దంటూ జైషే మహమ్మద్‌ ముసుగు సంస్థ.. పీపుల్స్‌ యాంటీ ఫాసిస్టు ఫోర్స్‌ గతేడాదే హెచ్చరించింది.

ఈటీవీ భారత్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు