మీరు దేశానికి చేసిన సేవలు అమోఘం

వచ్చే నెల పదవీవిరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌లు న్యాయవ్యవస్థకు, దేశానికి చేసిన సేవలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కొనియాడారు.

Published : 20 May 2023 06:33 IST

జూన్‌లో పదవీ విరమణ చేయనున్న ముగ్గురు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు ఘనంగా వీడ్కోలు

దిల్లీ: వచ్చే నెల పదవీవిరమణ చేయనున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌, జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, జస్టిస్‌ రామసుబ్రమణియన్‌లు న్యాయవ్యవస్థకు, దేశానికి చేసిన సేవలను ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ కొనియాడారు. ఈ ముగ్గురు న్యాయమూర్తుల గౌరవార్థం సుప్రీంకోర్టు బార్‌ అసోషియేషన్‌ (ఎస్‌సీబీఏ) శుక్రవారం సాయంత్రం వీడ్కోలు సభ ఘనంగా నిర్వహించింది. ఇందులో సీజేఐ మాట్లాడారు. అంతకుముందు న్యాయస్థానంలో జస్టిస్‌ చంద్రచూడ్‌ .. ఈ ముగ్గురు న్యాయమూర్తుల వీడ్కోలు ధర్మాసనాలకు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ, వాణిజ్య చట్టాల అంశాల్లో జస్టిస్‌ కె.ఎం.జోసెఫ్‌ నైపుణ్యాన్ని సీజేఐ శ్లాఘించారు. జస్టిస్‌ రస్తోగీని ఆప్తమిత్రుడిగా పేర్కొన్నారు. జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ను బహుముఖ ప్రతిభావంతుడని అన్నారు. జూన్‌ 16న జస్టిస్‌ జోస్‌ఫ్‌, అదే నెల 17న జస్టిస్‌ అజయ్‌ రస్తోగీ, 29న జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ నెల 22 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారమే ఆఖరి పనిదినం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని