Supreme Court: పాత విద్యుత్తు బకాయిలను కొత్త యజమాని నుంచి వసూలుచేసుకోవచ్చు: సుప్రీం

ఏదైనా ఒక ప్రాంగణం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలను దాన్ని కొత్తగా కొనుగోలుచేసిన వారినుంచి వసూలుచేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

Updated : 20 May 2023 08:54 IST

ఈనాడు, దిల్లీ: ఏదైనా ఒక ప్రాంగణం నుంచి రావాల్సిన విద్యుత్తు బకాయిలను దాన్ని కొత్తగా కొనుగోలుచేసిన వారినుంచి వసూలుచేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. కేరళకు చెందిన ఓ కేసులో శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతోకూడిన ధర్మాసనం ఈమేరకు తీర్పు వెలువరించింది. పాత యజమానులు బిల్లులు కట్టలేదన్న కారణంతో తమ నివాస ప్రాంగణాలకు విద్యుత్తు నిలిపేశారని పేర్కొంటూ 19 మంది దాఖలుచేసిన అప్పీళ్లలో సుప్రీంకోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. ‘‘2003 విద్యుత్తు చట్టంలోని సెక్షన్‌ 43 ప్రకారం విద్యుత్తు సరఫరా చేయడం తప్పనిసరి కాదు. అది విద్యుత్తు పంపిణీ సంస్థలు నిర్దేశించిన ఛార్జీలు, నియమనిబంధనలకు లోబడి చేసుకొనే దరఖాస్తుకు అనుగుణంగా ఉంటుంది. 1948 నాటి చట్టంలోని సెక్షన్‌ 49 ప్రకారం విద్యుత్తు సరఫరాచేయాలంటే పాత యజమాని బకాయిలను కొత్త యజమాని చెల్లించడం తప్పనిసరి. పాత బకాయిలను కొత్త యజమాని నుంచి వసూలుచేసుకోవడానికి ఎలెక్ట్రిసిటీ సప్లైకోడ్‌ వీలు కల్పిస్తోంది.’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని