అస్సాంలో ఉపాధ్యాయులకూ డ్రెస్‌కోడ్‌

అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు యూనిఫాం ధరించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకూ డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించింది.

Published : 21 May 2023 04:14 IST

గువాహటి: అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు యూనిఫాం ధరించినట్లే.. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని పాఠశాలల ఉపాధ్యాయులకూ డ్రెస్‌ కోడ్‌ నిర్ణయించింది. విధులకు హాజరైనప్పుడు జీన్స్‌, టీషర్టులు, లెగ్గిన్స్‌ను పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు ఉపాధ్యాయుల్ని చూసి ఎన్నో విషయాలు నేర్చుకుంటారని, వారి వస్త్రధారణ కూడా విద్యార్థులపై ప్రభావం చూపుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అందుకే వారికి డ్రెస్‌ కోడ్‌ తప్పనిసరి చేసినట్లు తెలిపింది. ‘‘కొన్ని పాఠశాల్లోని ఉపాధ్యాయులు తమకు నచ్చిన దుస్తులు వేసుకొని పాఠశాలకు వస్తున్నారని మా దృష్టికి వచ్చింది. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలి. వృత్తికి గౌరవం కలిగేలా హుందాగా ఉండే దుస్తులు ధరించడం అవసరం’’ అని పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి నారాయణ్‌ కౌన్వార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని