‘మన సైనికుల శవాలపైనే 2019 లోక్‌సభ ఎన్నికల పోరు.. దీనిపై ఎలాంటి విచారణ జరగలేదు’
జమ్మూ-కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ విమర్శించారు.
సత్యపాల్ మాలిక్ వ్యాఖ్య
జైపుర్: జమ్మూ-కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్.. పుల్వామా ఉగ్రదాడి ఘటనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని మళ్లీ విమర్శించారు. 2019 ఎన్నికలు ‘మన సైనికుల శవాలపై పోరాటమే’నని వ్యాఖ్యానించారు. ‘‘2019 లోక్‌సభ ఎన్నికల పోరు మన సైనికుల శవాలపై జరిగింది. దీనిపై ఎలాంటి దర్యాప్తు జరగలేదు. ఈ ఘటనపై విచారణ జరిగిఉంటే అప్పటి హోం మంత్రి (రాజ్‌నాథ్‌సింగ్) రాజీనామా చేయాల్సి వచ్చేది. చాలా మంది అధికారులు జైలు పాలయ్యేవారు. చాలా వివాదాస్పదం అయ్యేది’’ అని రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా బన్సూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. ఉగ్రదాడి జరిగిన ఫిబ్రవరి 14, 2019న ప్రధానమంత్రి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో షూటింగ్‌లో ఉన్నారని గుర్తుచేశారు. ‘‘ఆయన (మోదీ) నేషనల్ పార్కు నుంచి బయటకు రాగానే నేను ఫోన్ చేశాను. మన పొరపాటు కారణంగా మన సైనికులు మరణించారని చెప్పారు. దీంతో ఆయన మౌనంగా ఉండాల్సిందిగా నాకు చెప్పారు’’ అని వెల్లడించారు. వ్యాపారవేత్త అదానీ కేవలం మూడేళ్లలోనే సంపద పోగుచేశారన్నారు. ప్రభుత్వాన్ని మార్చాలని ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన సత్యపాల్ మాలిక్ .. ఒకవేళ మీరు మళ్లీ వారికి ఓటేస్తే భవిష్యత్తులో ఓటు వేసే అవకాశాన్నే కోల్పోతారని హెచ్చరించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Health News
అశ్లీల చిత్రాలు తరచూ చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి!
-
Movies News
NTR Centenary Celebrations: ఎన్టీఆర్ స్మరణలో సినీ తారలు.. సోషల్‌మీడియాలో పోస్టులు
-
World News
viral news: లైవ్‌లో అతిగా మద్యం తాగి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి..!
-
Sports News
IPL 2023: ఈసారి మా గేమ్ ప్లాన్ మాత్రం అలా ఉండదు: చెన్నై సూపర్ కింగ్స్ కోచ్
-
India News
New Parliament building: ప్రధాని పట్టాభిషేకంలా భావిస్తున్నారు: రాహుల్ గాంధీ
-
Movies News
Sharwanand: నేను క్షేమంగా ఉన్నా.. రోడ్డు ప్రమాదంపై శర్వానంద్ ట్వీట్