అధికారులపై ఆగ్రహంతో.. పాము తలను నమిలేశాడు

మద్యం మత్తులో బతికున్న పాము తలను నోటితో నమిలాడు ఓ వ్యక్తి. తమ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డాడు.

Updated : 23 May 2023 04:46 IST

ద్యం మత్తులో బతికున్న పాము తలను నోటితో నమిలాడు ఓ వ్యక్తి. తమ ఇళ్లను రైల్వే అధికారులు ఖాళీ చేయిస్తున్నారన్న ఆగ్రహంతో ఈ చర్యకు పాల్పడ్డాడు. ఉత్తరాఖండ్‌లోని నైనీతాల్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. లాల్కువాన్‌ రైల్వే స్టేషన్‌ పరిధిలోని ప్రభుత్వ భూమిని ఆక్రమించారనే కారణంతో అధికారులు అక్కడి వారందరినీ ఖాళీ చేయిస్తున్నారు. ఇళ్లను కూడా తొలగిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి ఓ పాము వచ్చింది. దాన్ని చూసిన ఓ వ్యక్తి.. పాము తల భాగాన్ని నమిలేశాడు. అక్కడున్న వారు ఎంత చెప్పినా వినకుండా ఎడాపెడా పామును కొరికేశాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు