షారుక్‌ సందేశాలను తన నిజాయతీకి ఆధారాలుగా వాంఖడే చూపుతున్నారు!

డ్రగ్స్‌ కేసులో లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే.

Updated : 23 May 2023 05:44 IST

బాంబే హైకోర్టుకు తెలిపిన సీబీఐ

ముంబయి: డ్రగ్స్‌ కేసులో లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) మాజీ జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే...తాను నిజాయతీపరుడినని నిరూపించుకోవడానికి సినీ నటుడు షారుక్‌ ఖాన్‌ పంపిన సందేశాలను చూపే యత్నం చేస్తున్నారని సీబీఐ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. షారుక్‌ తనయుడు ఆర్యన్‌ ఖాన్‌ను విహార నౌక డ్రగ్స్‌ కేసులో ఇరికించకుండా ఉండడానికి వాంఖడే రూ.25 కోట్లను డిమాండ్‌ చేశారనే ఆరోపణలకు సంబంధించిన కేసుపై హైకోర్టు విచారణ జరుపుతోంది. సీబీఐ, వాంఖడే తరఫు న్యాయవాదులు సోమవారం తమ వాదనలు వినిపించారు. వాంఖడేను ఈ నెల 22 వరకు అరెస్టు చేయవద్దంటూ జస్టిస్‌ అభయ్‌ ఆహుజా, జస్టిస్‌ ఎం.ఎం.సథయే ధర్మాసనం గత శుక్రవారం ఇచ్చిన ఆదేశాలను పొడిగించవద్దని సీబీఐ కోరింది. అయితే వాంఖడేపై జూన్‌ 8 వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకుండా సీబీఐకి ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను ఆ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని