విచారణకు హాజరైన బి.వి.శ్రీనివాస్‌

మానసిక, లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ సోమవారం గువాహటి పోలీసుల ఎదుట హాజరయ్యారు.

Published : 23 May 2023 05:18 IST

గువాహటి: మానసిక, లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో యువజన కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ సోమవారం గువాహటి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఉద్వాసనకు గురైన యువజన కాంగ్రెస్‌ మాజీ నాయకురాలు అంకితా దత్తా ఫిర్యాదుతో ఈ కేసు నమోదైంది. శ్రీనివాస్‌ తన న్యాయవాదితో కలిసి ఉదయం 11 గంటలకు పాన్‌బజార్‌ మహిళా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చారు. దాదాపు గంటన్నర సమయం అక్కడ ఉన్న తర్వాత నగరంలోని సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. గంట తర్వాత వెలుపలకు వచ్చిన శ్రీనివాస్‌...విలేకరులతో మాట్లాడుతూ ‘ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. న్యాయవ్యవస్థపై విశ్వాసముంద’ని తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసుల ఎదుట హాజరైనట్లు చెప్పారు. శ్రీనివాస్‌ను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని