సంక్షిప్త వార్తలు(7)
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గం వేలంలో సుమారు 14 మిలియన్ పౌండ్లు(రూ.144 కోట్లు) పలికింది.
టిప్పు ఖడ్గానికి రూ.144 కోట్లు
మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ ఉపయోగించిన 18వ శతాబ్దం నాటి ఈ ఖడ్గం వేలంలో సుమారు 14 మిలియన్ పౌండ్లు(రూ.144 కోట్లు) పలికింది. లండన్‌లోని బోన్హమ్స్ ఆక్షన్ హౌస్ ఈ నెల 23న దీన్ని వేలం వేసింది.
మణిపుర్‌లో శాంతికి అమిత్ షా పిలుపు
గువాహటి: అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని, శాంతియుత వాతావరణానికి సహకరించాలని మణిపుర్ ప్రజలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు. ‘జాతీయ నేర వైజ్ఞానిక శాస్త్రాల విశ్వవిద్యాలయం’ (ఎన్‌ఎఫ్‌ఎస్‌యూ) పదో ప్రాంగణానికి శంకుస్థాపన నిమిత్తం అస్సాంలోని కామ్‌రూప్ జిల్లాకు వచ్చిన ఆయన గురువారం ఈ మేరకు వ్యాఖ్యానించారు. ‘త్వరలోనే మణిపుర్ రాష్ట్రాన్ని సందర్శించి, మూడు రోజులు పర్యటిస్తాను. ముందుగా రెండు వర్గాలు అపనమ్మకాలు తొలగించుకోవాలి. శాంతిని పునఃప్రతిష్ఠించాలి’ అని తెలిపారు. ఆరేళ్లకు పైగా శిక్షపడే అవకాశం ఉన్న నేరాల్లో క్షేత్రస్థాయి సందర్శనకు ఫోరెన్సిక్ నిపుణులు వెళ్లడాన్ని తప్పనిసరి చేసేలా చట్టపరంగా మార్పులు తీసుకువచ్చే యోచన ఉందని తెలిపారు. దీంతోపాటు ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాల్లోనూ మార్పులు రానున్నాయన్నారు. థర్డ్‌డిగ్రీ పద్ధతులతో కాకుండా శాస్త్రీయంగా ఆధారాలు సేకరించాల్సి ఉందని, దీనికి నిపుణులు అవసరమని చెప్పారు. ఆధారాలు లేని కారణంగానే దేశంలో 50% మంది దోషులకే శిక్షలు పడుతున్నాయన్నారు. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రయోగశాలలను నవీకరించడంతో పాటు ప్రాంతీయంగా వాటిని నెలకొల్పి, సంచార ల్యాబ్‌లను జిల్లాస్థాయిలో తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలిపారు.
* అస్సాం వరకు వచ్చిన అమిత్‌షా.. కల్లోలిత మణిపుర్‌కు మాత్రం ఎందుకు వెళ్లలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. 22 రోజులుగా రగిలిపోతున్న రాష్ట్రాన్ని సందర్శించడానికి మంత్రికి సమయం చిక్కలేదా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ దిల్లీలో విమర్శించారు.
మణిపుర్‌లో మరోసారి హింస.. మంత్రి ఇంట్లోకి ఆందోళనకారులు
ఇంఫాల్: తాజాగా మణిపుర్‌లో జరిగిన అల్లర్లలో ఒకరు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి బిష్ణుపుర్ జిల్లాలోని తోరొంగ్లోబి గ్రామంలోని శిబిరాల్లో తలదాచుకుంటున్నవారి ఇళ్లకు అనుమానిత తీవ్రవాదులు నిప్పు పెట్టారు. అక్కడివారంతా ఇతర చోట్ల నుంచి ఆ శిబిరాలకు వెళ్లారు. పొంచి ఉన్న మిలిటెంట్లు వీరిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో 24 గంటలపాటు కర్ఫ్యూ విధించారు. ఆందోళనకారులు పీడబ్ల్యూడీ శాఖ మంత్రి కొంతోవుజం గోవిందాస్ ఇంటిని చిందరవందర చేశారు. ఆ సమయంలో మంత్రి కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేరు
పంజాబ్ సీఎంకు జడ్ ప్లస్ భద్రత
దిల్లీ: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌కు ‘జడ్ ప్లస్’ స్థాయి భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పంజాబ్‌లో ఖలిస్థాన్ వేర్పాటువాద ముఠాల కార్యకలాపాల నేపథ్యంలో దేశం లోపల, వెలుపల నుంచి ఆయనకు ముప్పు పొంచి ఉందన్న కేంద్ర నిఘా సంస్థల అంచనా మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాల తెలిపాయి.
రాష్ట్రీయ బాల పురస్కార్‌కు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, దిల్లీ: బాలల్లో గల అసాధారణ సామర్థ్యాలను గుర్తించి ఏటా అందించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్‌ల కోసం కేంద్ర మహిళా, శిశుసంక్షేమశాఖ.. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. సాహసం, క్రీడలు, సామాజికసేవ, శాస్త్ర, సాంకేతికం, పర్యావరణం, కళలు, సంస్కృతి, నవకల్పన రంగాల్లో విశేష ప్రతిభ చూపిన వారికి ఏటా జనవరిలో రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డుతోపాటు రూ.లక్ష నగదు, పతకం, అభినందనపత్రం అందిస్తారు. 18 ఏళ్లలోపు వయస్సున్న భారతీయ బాలలంతా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 31వ తేదీలోపు https://awards.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
పార్లమెంటులో ఆంక్షలను సడలించండి
- స్పీకరుకు ప్రెస్‌క్లబ్ విజ్ఞప్తి
దిల్లీ: పార్లమెంటులో మీడియాపై విధించిన కరోనా కాలంనాటి ఆంక్షలను ఎత్తివేయాలని ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా లోక్‌సభ స్పీకరు ఓం బిర్లాకు విజ్ఞప్తి చేసింది. ఈ ఆంక్షల కారణంగా పార్లమెంటు సమావేశాలను కవర్ చేయడానికి ఇప్పటికీ చాలా మందిని అనుమతించడం లేదని పేర్కొంది. ప్రస్తుతం కరోనా ఆందోళనకర పరిస్థితులు లేనందున ఆంక్షలు సబబు కాదని స్పీకరుకు రాసిన లేఖలో ప్రెస్‌క్లబ్ స్పష్టం చేసింది. మీడియాను నియంత్రించడానికి, పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించడానికే ఇంకా ఆంక్షలను ప్రభుత్వం కొనసాగిస్తోందని భావిస్తున్నామని అభిప్రాయపడింది. వెంటనే చర్యలు తీసుకుని మీడియాకు కొవిడ్ ముందునాటి అనుమతులను మంజూరు చేయాలని కోరింది.
వాయుమార్గంలో గుండె తరలింపు
దిల్లీ: ఆర్మీ వైద్య బృందం, భారత వాయు దళం(ఐఏఎఫ్) సంయుక్త కృషితో ఓ దాత నుంచి సేకరించిన గుండెను శరవేగంతో తరలించాయి. తద్వారా 19 ఏళ్ల ఓ యువతికి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి తమ వంతు పాత్ర పోషించాయి. గురువారం వాయుదళానికి చెందిన ఓ విమానం దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రి నుంచి వైద్యుల బృందాన్ని జైపుర్‌లోని ఎస్‌ఎంఎస్ వైద్య కళాశాలకు తీసుకెళ్లింది. అక్కడ దాత నుంచి గుండెను సేకరించాక, ఆ హృదయంతోపాటు వైద్యుల బృందాన్ని తిరిగి సకాలంలో దిల్లీలోని ఆర్మీ ఆసుపత్రికి తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన చిత్రాలను వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ప్రధాన కార్యాలయం ట్విటర్ ఖాతాలో పంచుకుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten Stories odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. పది ముఖ్యమైన కథనాలివే!
-
India News
Odisha Train Tragedy: కొన్ని క్షణాల ముందు ఏం జరిగింది?.. వెలుగులోకి ట్రాఫిక్ ఛార్ట్
-
Sports News
WTC Final: ‘ఆస్ట్రేలియా ఫేవరెట్’.. ఫలితం తారుమారు కావడానికి ఒక్క రోజు చాలు: రవిశాస్త్రి
-
India News
Mamata Banerjee: రైల్వే నా బిడ్డవంటిది.. ఈ ప్రమాదం 21వ శతాబ్దపు అతి పెద్ద ఘటన
-
India News
Odisha Train Tragedy: భారత్‌కు అండగా ఉన్నాం.. రైలు ప్రమాదంపై ప్రపంచ నేతలు!
-
India News
Odisha Train Tragedy: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ట్రాక్ మారడం వల్లే.. రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక