పార్లమెంటు నూతన భవనం హోమం, సర్వమత ప్రార్థనలతో ప్రారంభం

పార్లమెంటు నూతన భవనాన్ని ఆదివారం ఉదయం హోమం, సర్వమత ప్రార్థనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.

Published : 26 May 2023 04:17 IST

దిల్లీ: పార్లమెంటు నూతన భవనాన్ని ఆదివారం ఉదయం హోమం, సర్వమత ప్రార్థనల మధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తొలిగా లోక్‌సభ ఛాంబర్‌ను ఆయన ఆరంభిస్తారు. పార్లమెంటు ఆవరణ బయట ఉదయం ఏడు గంటలకు హోమాన్ని నిర్వహిస్తారు. ఆ సందర్భంగా శైవ మత ప్రధాన పూజారి ఉత్సవ రాజదండాన్ని (సెంగోల్‌) ప్రధాని మోదీకి అందజేస్తారు. దానిని లోక్‌సభలో స్పీకర్‌ స్థానానికి పక్కన ప్రతిష్ఠిస్తారు. ఈ మేరకు అధికారులు వెల్లడించారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవ ప్రధాన కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం ప్రధాని మోదీ సమక్షంలో మొదలవుతుంది. దీనికి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ తదితరులు హాజరుకానున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, లోక్‌సభ మాజీ స్పీకర్‌ శివరాజ్‌ పాటిల్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష నేతలకు కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు వెళ్లాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు