CBDT: ఆ రూ.25 లక్షలపై పన్ను ఉండదు

ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు వారి పదవీ విరమణ సమయంలో సెలవుల నగదీకరణతో వచ్చే పన్ను మినహాయింపు మొత్తాన్ని కేంద్రం గురువారం పెంచింది.

Updated : 26 May 2023 08:14 IST

సెలవుల నగదీకరణ మొత్తంపై కేంద్రం తాజా నిర్ణయం

దిల్లీ: ప్రైవేటు రంగంలో ఉద్యోగులకు వారి పదవీ విరమణ సమయంలో సెలవుల నగదీకరణతో వచ్చే పన్ను మినహాయింపు మొత్తాన్ని కేంద్రం గురువారం పెంచింది. ప్రైవేటు ఉద్యోగులకు 2002లో నిర్దేశించిన రూ.3 లక్షల మొత్తాన్ని ఏకంగా రూ.25 లక్షలకు పెంచింది. సెక్షన్‌ 10(10ఏఏ)(2) ప్రకారం ఓ ప్రైవేటు ఉద్యోగి ఆర్జించే మొత్తం రూ.25 లక్షలకు మించకుండా ఉంటే అది పన్ను రహితం అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తన ప్రకటనలో వివరించింది. తాజా సౌకర్యం ఏప్రిల్‌ 1, 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని