సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్‌ సూద్‌

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా 1986 బ్యాచ్‌ కర్ణాటక కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు.

Published : 26 May 2023 04:17 IST

ఈనాడు, దిల్లీ: సీబీఐ కొత్త డైరెక్టర్‌గా 1986 బ్యాచ్‌ కర్ణాటక కేడర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీబీఐ అధికారులతో మాట్లాడారు. ఇప్పటి వరకూ ఈ స్థానంలో ఎస్‌కే జైశ్వాల్‌ ఉన్నారు. ప్రవీణ్‌ గతంలో కర్ణాటక డీజీపీగా పనిచేశారు. తన 37 ఏళ్ల ఐపీఎస్‌ కెరీర్‌లో ఆయన పలు ముఖ్యమైన స్థానాల్లో సేవలందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని