నృత్యకారిణి లేఖ.. వెలుగులోకి రాజదండం

పార్లమెంట్‌ కొత్త భవనంలో స్పీకర్‌ కుర్చీ పక్కన ఏర్పాటు చేస్తున్న రాజదండం(సెంగోల్‌)పై కేంద్రం దృష్టి సారించడం వెనుక ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఉన్నారు.

Published : 26 May 2023 05:13 IST

చెన్నై: పార్లమెంట్‌ కొత్త భవనంలో స్పీకర్‌ కుర్చీ పక్కన ఏర్పాటు చేస్తున్న రాజదండం(సెంగోల్‌)పై కేంద్రం దృష్టి సారించడం వెనుక ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆమె చేసిన ఓ అభ్యర్థన వల్లే 1947 తర్వాత కనుమరుగైన రాజదండం నమూనా ఇప్పుడు పార్లమెంట్‌లో కొలువుతీరబోతోంది. దీనికి సంబంధించిన వివరాలను గురువారం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ మీడియాకు తెలిపారు. ‘‘2021లో ఈ రాజదండం గురించి ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దానిని ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం తమిళం నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రధాన మంత్రి కార్యాలయానికి పంపారు. అలాగే అది ఎక్కడో ఉందో తెలుసుకోవాలని కోరారు. అనంతరం దాని జాడ తెలుసుకునేందుకు రెండు సంవత్సరాలు పట్టింది’ అని మంత్రి తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు