మోదీ పాలనకు 9 ఏళ్లు పూర్తి.. ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన భాజపా
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారం నాటికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ ‘9 సాల్ సేవా, సుశాసన్ ఔర్ గరీబ్ కల్యాణ్’ అన్న కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు.
ఈనాడు, దిల్లీ: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టి శుక్రవారం నాటికి తొమ్మిదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో గురువారం ఇక్కడ ‘9 సాల్ సేవా, సుశాసన్ ఔర్ గరీబ్ కల్యాణ్’ అన్న కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించారు. ఇందులో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, పీయూష్ గోయల్, అశ్వినీ వైష్ణవ్, జైశంకర్, రాజీవ్ చంద్రశేఖర్ పాల్గొని గత తొమ్మిదేళ్లలో దేశంలో వచ్చిన మార్పులను వివరించారు. మోదీ రాకముందు పదేళ్లు నడిచిన యూపీయే పాలన అవినీతికి ప్రతీకగా ఉంటే... గత తొమ్మిదేళ్ల పాలన అభివృద్ధికి నమూనాగా మారిందని జేపీ నడ్డా పేర్కొన్నారు. ఈ తొమ్మిదేళ్లలో మోదీ చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి పెద్దఎత్తున తీసుకువెళ్లడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. యూపీయే హయాంలో ప్రపంచ దేశాలు భారత్‌ను ఒక అవినీతి దేశంగా చూసేవని, 2014 నుంచి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో ముందడుగు వేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గత యూపీయే, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వాల మధ్య ఉన్న తేడాలను వివరిస్తూ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Ashwini Vaishnaw: ఆ నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు: టెలికాం మంత్రి
-
World News
Restaurant: ఎక్కువ ఆహారాన్ని ఆర్డర్ చేస్తే ఇలా అవమానిస్తారా..!
-
Sports News
CSK-Rayudu: మా ఇద్దర్నీ ముందే పిలిచాడు.. ధోనీ అలా భావించాడేమో: రాయుడు
-
Movies News
Vishwak Sen: అందుకే పేరు మార్చుకున్నా: విశ్వక్ సేన్
-
World News
Ukraine: జెలెన్స్కీ ఇంటి ఎదుట ‘నాటు-నాటు’ పాటకు దుమ్ములేపిన ఉక్రెయిన్ సైనికులు
-
India News
Train Accident: ‘కోరమాండల్’ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం.. ఉలిక్కి పడిన 4 రాష్ట్రాలు