నా పార్లమెంటు, నాకు గర్వకారణం అని చాటండి

నూతన పార్లమెంటు భవనం.. ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

Published : 27 May 2023 05:56 IST

ట్విటర్‌లో భవన సంక్షిప్త వీడియోను విడుదలచేసిన ప్రధాని మోదీ
సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి

దిల్లీ: నూతన పార్లమెంటు భవనం.. ప్రతీ భారతీయుడు గర్వించేలా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భవన సంక్షిప్త వీడియోను శుక్రవారం ఆయన ట్విటర్‌లో విడుదల చేశారు. ‘నా పార్లమెంటు, నాకు గర్వకారణం’ (మై పార్లమెంట్‌, మై ప్రైడ్‌) అనే హ్యాష్‌ట్యాగ్‌తో దీన్ని ప్రజలందరూ సామాజిక మాధ్యమాల్లో తమ గొంతుతో అభిప్రాయాన్ని తెలుపుతూ పంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందులో కొన్నింటిని తాను రీట్వీట్‌ చేస్తానని తెలిపారు. మోదీ ప్రకటన వెలువడగానే కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా.. ఇతర భాజపా మంత్రులు, ఆ పార్టీ నేతలు ఈ వీడియోను తమ ఖాతాల్లో పెట్టారు. లోక్‌సభ, రాజ్యసభలతో పాటు, పార్లమెంటు ప్రాంగణాన్ని ఈ వీడియోలో వర్చువల్‌గా చూపించారు. అత్యాధునిక సదుపాయాలతో దాదాపు 15 ఎకరాల్లో నిర్మించిన ఈ నూతన భవనాన్ని ఆదివారం.. ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని