దేశ సంస్కృతిని కాంగ్రెస్‌ ఎందుకు ద్వేషిస్తోంది?

ఉత్సవ రాజదండం (సెంగోల్‌)ను నడక కర్రగా కాంగ్రెస్‌ మార్చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ఆక్షేపించారు.

Published : 27 May 2023 05:26 IST

రాజదండం వివాదంపై అమిత్‌ షా ప్రశ్న

దిల్లీ: ఉత్సవ రాజదండం (సెంగోల్‌)ను నడక కర్రగా కాంగ్రెస్‌ మార్చేసిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా శుక్రవారం ఆక్షేపించారు. ‘‘భారత సంప్రదాయాలు, సంస్కృతిని కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు అంతగా ద్వేషిస్తుంది? 1947లో మనదేశ స్వాతంత్య్రానికి గుర్తుగా తమిళనాడులోని శైవ మఠం నేతృత్వంలో నెహ్రూకు అందించిన పవిత్ర రాజదండాన్ని ఓ నడక కర్రగా ప్రదర్శనశాలకు తరలించారు’’  అని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని