సత్యేందర్‌ జైన్‌కు ఆరు వారాల బెయిల్‌

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కోర్టు శుక్రవారం ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 27 May 2023 05:26 IST

దిల్లీ: మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన ఆప్‌ సీనియర్‌ నేత సత్యేందర్‌ జైన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కోర్టు శుక్రవారం ఆయనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. జైన్‌ ఆరోగ్య పరిస్థితిని ( 35 కిలోల బరువు తగ్గడాన్ని) పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆరు వారాలకు ఈ నిర్ణయం తీసుకొంది. ఈ మధ్యంతర బెయిల్‌ జులై 11వ తేదీన ముగుస్తుంది. అయితే ఈ సందర్భంగా న్యాయస్థానం కొన్ని షరతులు కూడా విధించింది. అనుమతి లేకుండా దిల్లీ దాటి వెళ్లకూడదని, మీడియా ముందు ఎటువంటి ప్రకటనలు చేయకూడదని స్పష్టం చేసింది. గతేడాది మే నెలలో అరెస్టయి తిహాడ్‌ జైలులో ఉన్న జైన్‌ ఆరోగ్యం గురువారం క్షీణించింది. జైలు గదిలోని స్నానాల గదిలో స్పృహతప్పి పడిపోయిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని