Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు

ఆ వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆనందం తట్టుకోలేని తండ్రి.. కుమార్తెను ఏనుగు మీద ఊరేగించాడు.

Updated : 28 May 2023 07:38 IST

ఆ వంశంలో 35 ఏళ్ల తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆనందం తట్టుకోలేని తండ్రి.. కుమార్తెను ఏనుగు మీద ఊరేగించాడు. మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ జిల్లా పచ్‌గావ్‌లో నివసించే గిరీశ్‌ పాటిల్‌కు అయిదు నెలల క్రితం కూతురు పుట్టింది. ముద్దుగా ఆమెకు ‘ఐరా’ అని పేరు పెట్టుకున్నారు. తొలిసారిగా శనివారం ఆ చిన్నారిని తన ఇంటికి తీసుకురాగా.. ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఆమెకు గిరీశ్‌ ఘనస్వాగతం పలికాడు. ఏనుగుపై ఊరేగిస్తూ డప్పు వాయిద్యాల మధ్య ఇంటికి తీసుకువెళ్లాడు. చాలా ఏళ్ల తరవాత తమ ఇంట కూతురు పుట్టిందని పాటిల్‌ కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని