ఇక్బాల్‌పై పాఠం తొలగింపునకు దిల్లీ విశ్వవిద్యాలయం తీర్మానం

రాజనీతి శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుంచి పాకిస్థాన్‌ జాతీయ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ గురించి ఉన్న పాఠాన్ని తొలగించాలని దిల్లీ విశ్వవిద్యాలయం అకడమిక్‌ కౌన్సిల్‌ తీర్మానించింది.

Published : 28 May 2023 04:37 IST

దిల్లీ: రాజనీతి శాస్త్ర పాఠ్య ప్రణాళిక నుంచి పాకిస్థాన్‌ జాతీయ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ గురించి ఉన్న పాఠాన్ని తొలగించాలని దిల్లీ విశ్వవిద్యాలయం అకడమిక్‌ కౌన్సిల్‌ తీర్మానించింది. దేశ విభజనకు బీజం వేసినవారి గురించి మనం పాఠాలు బోధించనక్కర్లేదని విశ్వవిద్యాలయ ఉప కులపతి యోగేష్‌ సింగ్‌ అన్నారు. అవిభక్త భారత్‌లోని సియాల్‌కోట్‌లో 1877లో జన్మించిన ఇక్బాల్‌.. ‘సారే జహాఁ సే అచ్ఛా హిందుస్థాన్‌ హమారా’ అనే ప్రసిద్ధ గీతాన్ని రచించారు. ముస్లిం లీగ్‌నూ, పాకిస్థాన్‌ ఉద్యమాన్ని సమర్థిస్తూ కూడా గీతాలు రాశారని యోగేష్‌ సింగ్‌ గుర్తుచేశారు. దేశాన్ని విభజించి పాకిస్థాన్‌ను ఏర్పాటు చేయాలనే భావనకు అంకురార్పణ చేసిన ఇక్బాల్‌కు బదులు మన జాతీయ వీరుల గురించి పాఠాలు బోధించాలని ఆయనన్నారు. ఆ ప్రతిపాదనను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. విశ్వవిద్యాలయ తత్వశాస్త్ర బీఏ కోర్సులో డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ, స్వామీ వివేకానందల తాత్విక భావనల గురించిన పాఠాలు ప్రవేశపెట్టాలని మండలి ఏకగ్రీవంగా నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని