Snake In Mid-Day Meal: పాఠశాల భోజనంలో పాము.. 25 మంది విద్యార్థులకు అస్వస్థత

బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు.

Updated : 28 May 2023 08:32 IST

బిహార్‌లోని ఓ పాఠశాలలో విద్యార్థుల కోసం వండిన మధ్యాహ్న భోజనంలో పాము కనిపించింది. ఆ భోజనం తిన్న చిన్నారుల్లో దాదాపు 25 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వీరంతా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. చిన్నారుల ఆరోగ్యం మెరుగ్గానే ఉందని అధికారులు తెలిపారు. ఆ భోజనం పాఠశాలలో వండలేదని.. ఓ కాంట్రాక్టరు సరఫరా చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. ఈ ఘటన అరారియా జిల్లాలోని ఫర్‌బిస్‌గంజ్‌ సబ్‌డివిజన్‌ పరిధి జోగ్‌బాని సెకండరీ స్కూలులో జరిగింది. మధ్యాహ్న భోజనం తిన్న చిన్నారుల్లో చాలామంది వాంతులు చేసుకున్నారు. పాఠశాల వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

 ఈటీవీ భారత్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని