రేపు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం
తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం చేపట్టనున్నారు.
27:30 గంటల పాటు కొనసాగనున్న కౌంట్‌డౌన్
శ్రీహరికోట, న్యూస్‌టుడే: తిరుపతి జిల్లాలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి సోమవారం ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం చేపట్టనున్నారు. శనివారం షార్‌లో రాకెట్ సన్నద్ధత సమావేశం(ఎంఆర్‌ఆర్) జరిగింది. ఇందులో ప్రయోగానికి సంబంధించిన అంశాలపై శాస్త్రవేత్తలు చర్చించారు. ఆదివారం ఉదయం 7:12 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి 27:30 గంటల పాటు కొనసాగించాలని నిర్ణయించారు.
చెంగాళమ్మ ఆలయంలో పూజలు
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్12 ప్రయోగం చేపట్టనున్న సందర్భంగా ఇస్రో అధిపతి డా. సోమనాథ్ శనివారం సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) నావిగేషన్ సేవల కోసం గతంలో పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాల్లో నాలుగింటికి జీవితకాలం ముగిసిందని, వాటి స్థానంలో ప్రతి ఆరునెలలకు ఒక ఉపగ్రహాన్ని పంపేలా సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Disney+: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+.. పాస్వర్డ్ షేరింగ్‌కు చెక్.. ఇండియాలోనూ?
-
Vishal: రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్
-
Tragedy: అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!
-
Byreddy Rajasekhar reddy: స్కామ్‌లు చేయడం జగన్‌కు అలవాటేమో.. చంద్రబాబుకు కాదు: బైరెడ్డి
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ