పన్నెండేళ్ల చిన్నారికి పాప పుట్టింది

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం.

Updated : 28 May 2023 09:50 IST

పంజాబ్‌లోని అమృత్‌సర్‌ జిల్లా ఫగ్వారా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో పన్నెండేళ్ల బాలిక శనివారం ఓ చిన్నారికి జన్మనిచ్చింది. ఏడు నెలల క్రితమే ఆ బాలిక గర్భం దాల్చినప్పటికీ.. ఆ విషయం ఆమెకు తెలియకపోవడం గమనార్హం. బాలిక కడుపునొప్పితో బాధపడుతూ గురునానక్‌ దేవ్‌ ఆసుపత్రికి వచ్చింది. పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె గర్భవతి అని నిర్ధరించారు. అనంతరం ప్రసవం చేసి.. 800 గ్రాముల బరువున్న పాపను బయటకు తీశారు. తల్లీబిడ్డల పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. తన కుమార్తె గత ఏడు నెలలుగా కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె తండ్రి తెలిపాడు. నొప్పి అన్నపుడల్లా.. మందులు తెచ్చి ఇచ్చేవాడినని వివరించాడు. ఆసుపత్రికి వచ్చిన తరవాతే గర్భవతి అని తెలిసిందన్నాడు. ఇంట్లో తామిద్దరమే ఉంటామని, తన భార్య ఇల్లు విడిచి వెళ్లిపోయిందన్నాడు. బాధితురాలిని ప్రశ్నించగా.. ఏడు నెలల కిందట బహిర్భూమికి వెళ్లినపుడు తనపై అత్యాచారం జరిగిందని తెలిపింది. త్వరలోనే నిందితుడిని అరెస్ట్‌ చేస్తామని పోలీసులు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు