పోలీసు దళంలో చేరుతానంటున్న మాజీ నక్సలైట్‌

మహారాష్ట్రలోని గోందియా జిల్లా కుర్‌ఖేడా తహశీల్‌కు చెందిన లావ్‌హరి గ్రామ గిరిజన యువతి రాజుల రావెల్సింగ్‌ హిదామి (19) ఈ వారం వెలువడిన 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాల్లో 45.83 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

Published : 28 May 2023 05:09 IST

12వ తరగతిలో ఉత్తీర్ణత.. ఎస్పీ సత్కారం

గోందియా: మహారాష్ట్రలోని గోందియా జిల్లా కుర్‌ఖేడా తహశీల్‌కు చెందిన లావ్‌హరి గ్రామ గిరిజన యువతి రాజుల రావెల్సింగ్‌ హిదామి (19) ఈ వారం వెలువడిన 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాల్లో 45.83 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఒకప్పుడు తుపాకి చేతపట్టి అడవుల్లో తిరిగిన నక్సలైటు హిదామి.. ఆ బాటను మార్చుకొని చదువుపై దృష్టి సారించి ఈ ఘనత సాధించడం విశేషం. డిగ్రీ పూర్తయ్యాక  పోలీసుదళంలో చేరాలని ఉన్నట్లు ఆమె చెబుతోంది. గోందియా ఎస్పీ నిఖిల్‌ పింగలే శనివారం హిదామీని సత్కరించారు. 2016-17 ప్రాంతంలో తన గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న హిదామీని నక్సల్స్‌ అపహరించి, బలవంతంగా కుర్‌ఖేడా దళంలో చేర్చుకొన్నట్లు స్థానిక పోలీస్‌ అధికారి తెలిపారు. ఆ తర్వాత సాయుధ శిక్షణ పొందిన ఆమె పోలీసులపై జరిగిన ఓ హింసాత్మక దాడిలో భాగస్వామి అయ్యారు. రెండేళ్ల తర్వాత పోలీసుల సాయంతో లొంగిపోయిన హిదామి.. అధికారుల సూచన మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని