బెంగాల్లో మణిపుర్‌ తరహా కుట్ర

జాతుల మధ్య ఘర్షణలను సృష్టించి పశ్చిమ బెంగాల్‌లోనూ మణిపుర్‌ తరహా పరిస్థితులకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

Published : 28 May 2023 05:09 IST

ముఖ్యమంత్రి మమత ఆరోపణ

సల్బోని: జాతుల మధ్య ఘర్షణలను సృష్టించి పశ్చిమ బెంగాల్‌లోనూ మణిపుర్‌ తరహా పరిస్థితులకు కేంద్రం కుట్ర పన్నుతోందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్ర మంత్రి బీర్బహ హండ్సే కారుపై శుక్రవారం జరిగిన దాడిని ఆమె ఖండించారు. ఆయనపై దాడి చేసింది భాజపా కార్యకర్తలేనని, కుర్మీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఆ వర్గం పేరుతో మణిపుర్‌ తరహా పరిస్థితులను సృష్టించాలని భాజపా చూసిందని ఆరోపించారు. ‘మణిపుర్‌ ఘర్షణల వెనుక భాజపా ఉంది. పశ్చిమ బెంగాల్లోనూ అదే పని చేద్దామని అనుకుంది. ఆదివాసీలు కుర్మీలతో ఘర్షణలకు కుట్ర చేసింది. ఆ పేరుతో రాష్ట్రంలో సైన్యాన్ని దించాలని ప్రయత్నించింది. అప్పుడు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులిచ్చి కల్లోలం సృష్టించాలని చేసింది’ అని మమత ఆరోపించారు. సల్బోనిలో శనివారం జరిగిన సభలో ఆమె మాట్లాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని