మణిపుర్‌లో ఇప్పటివరకు 40 మంది మిలిటెంట్ల హతం
మణిపుర్‌లో ఆదివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కొండ ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన సాయుధులైన కుకీ మిలిటెంట్లు లోయల్లోని మేతీ తెగకు చెందిన 8 గ్రామాలపై దాడులు చేశారు.
ముఖ్యమంత్రి బీరేన్‌సింగ్ ప్రకటన
మళ్లీ దాడులకు దిగిన కుకీలు
ఘర్షణల్లో పోలీసు సహా ఇద్దరి మృతి..
ఇంఫాల్: మణిపుర్‌లో ఆదివారం మళ్లీ అల్లర్లు చెలరేగాయి. కొండ ప్రాంత జిల్లాల నుంచి వచ్చిన సాయుధులైన కుకీ మిలిటెంట్లు లోయల్లోని మేతీ తెగకు చెందిన 8 గ్రామాలపై దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణల్లో ఒక పోలీసుసహా ఇద్దరు చనిపోయారు. 12 మంది గాయపడ్డారు. మరోవైపు ఆయుధాలతో తిరుగుతున్న 40 మంది కుకీ మిలిటెంట్లను భద్రతా బలగాలు ఇప్పటివరకూ కాల్చి చంపాయని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ప్రకటించారు. ఇంకా పలువురిని జాట్ రెజిమెంట్ పట్టుకుందని తెలిపారు. రాష్ట్రంలో 38 సున్నిత ప్రాంతాలను గుర్తించామని, పోలీసులు అక్కడ ఆపరేషన్ చేపట్టారని చెప్పారు. ఆదివారం రెండు మిలిటెంట్ వర్గాల మధ్య, మిలిటెంట్లు, పోలీసుల మధ్య ఘర్షణలు తలెత్తాయని వివరించారు. దీంతో 11 గంటలపాటు సడలించిన కర్ఫ్యూను ఆరున్నర గంటలకు అధికారులు కుదించారు. మేతీ గ్రూప్ మిలిటెంట్లు కచింగ్ పోలీస్ స్టేషన్‌లో ఆయుధాలను ఎత్తుకెళ్లారని సమాచారం.
నేడు అమిత్ షా రాక
మణిపుర్‌లో ఘర్షణలు తగ్గకపోవడంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం ఇంఫాల్‌కు రానున్నారు. ఆయన ప్రత్యక్షంగా అక్కడి పరిస్థితిని పర్యవేక్షించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Electric One: ఎలక్ట్రిక్ వన్ నుంచి రెండు విద్యుత్ స్కూటర్లు.. సింగిల్ ఛార్జింగ్‌తో 200KM
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్‌పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ