మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
ఝార్ఖండ్‌లోని రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు దొంగలు దిబ్దిహ్ వంతెన సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు.
ఝార్ఖండ్‌లోని రాంచీలో సల్మాన్, జాఫర్ అనే ఇద్దరు దొంగలు దిబ్దిహ్ వంతెన సమీపంలో రోడ్డు మీద వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు లాగేశారు. బాధితురాలు గట్టిగా కేకలు వేసింది. బైక్ మీద పారిపోతున్న దొంగలను కిలోమీటరు దూరం వెంబడించి పోలీసులు పట్టుకున్నారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు సల్మాన్ చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు. వెంటనే అతణ్ని రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు వైద్యులు గుర్తించారు. గొలుసు.. ఎక్కువసేపు అలాగే ఉంటే ఇన్‌ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని వైద్యులు చెప్పడంతో తనను కాపాడాలని సల్మాన్ పోలీసులను వేడుకొంటున్నాడు. రాంచీలో ఒంటరిగా వెళ్తున్న మహిళలే లక్ష్యంగా సల్మాన్, జాఫర్ పలు చోరీలకు పాల్పడ్డారు. నిందితులు దొంగతనానికి వాడిన బైక్ కూడా చోరీ చేసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.