ప్రభుత్వ అధికారులకు త్వరలో ఉబర్ సేవలు
క్యాబ్ నిర్వహణ సంస్థ ఉబర్ సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉబర్ ట్యాక్సీలను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
దిల్లీ: క్యాబ్ నిర్వహణ సంస్థ ఉబర్ సేవలను ఉపయోగించుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో వివిధ మంత్రిత్వ శాఖలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉబర్ ట్యాక్సీలను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ పోర్టల్ (జీఈఎం), ఉబర్ మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరినట్లు ఓ అధికారి తెలిపారు. దీన్ని ఉబర్ కంపెనీకి చెందిన ఒక ప్రతినిధి కూడా ధ్రువీకరించారు. ప్రస్తుతం ఈ సేవలు పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైనట్లు సదరు అధికారి తెలిపారు. త్వరలోనే వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలకు అందుబాటులోకి వస్తాయన్నారు. దశలవారీగా దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. స్థిర ధరల వద్ద ఉబర్ ఈ సేవలను అందించనున్నట్లు వెల్లడించారు. జీఈఎం పోర్టల్‌లో ఉబర్ ఇప్పటికే నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వివిధ వస్తువులు, సేవలను సమకూర్చుకునేందుకు ప్రభుత్వం 2016లో జీఈఎంను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రొక్యూర్‌మెంట్‌లో పారదర్శకతను పెంపొందించడమే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చింది. వివిధ మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ విభాగాలు ట్యాక్సీ సేవల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నాయి. ఉబర్‌తో భాగస్వామ్యం వల్ల ఖర్చులు తగ్గుతాయని ప్రభుత్వం యోచిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
YSRCP: వైకాపా జిల్లా అధ్యక్షుల మార్పు
-
Vizag: ఫోర్జరీ సంతకాలతో ముదపాక భూముల విక్రయం
-
Rahul Gandhi: భారాస అంటే భాజపా రిస్తేదార్ సమితి: రాహుల్
-
TDP: ‘ఐప్యాక్‌కు రూ.274 కోట్లు అప్పనంగా దోచిపెట్టారు’
-
Jangaon: విద్యుత్తు స్తంభంపై కార్మికుని నరకయాతన
-
దిల్లీ మద్యం కేసులో అప్రూవర్లుగా మాగుంట రాఘవ్, దినేష్ అరోరా