సత్యేందర్ జైన్‌ను పరామర్శించిన కేజ్రీవాల్
తలకు తీవ్ర గాయం తగలడంతో ఆస్పత్రిలో చేరిన దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు.
‘హీరో’ని కలిశానంటూ ట్వీట్
దిల్లీ: తలకు తీవ్ర గాయం తగలడంతో ఆస్పత్రిలో చేరిన దిల్లీ మాజీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌తో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. జైన్ చికిత్స పొందుతున్న దిల్లీలోని ఆస్పత్రిలో పరామర్శించిన కేజ్రీవాల్.. ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలు షేర్ చేసిన కేజ్రీవాల్.. ధైర్యశాలి, హీరోతో సమావేశమయ్యానంటూ ట్వీట్ చేశారు. మనీలాండరింగ్ ఆరోపణలతో గత ఏడాదిగా జైల్లో ఉంటున్న జైన్‌కు మధ్యంతర బెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల సత్యేందర్ జైన్.. తిహాడ్ జైలులోని బాత్‌రూమ్‌లో స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన తల, చేతులకు గాయాలైనట్లు సమాచారం. స్పందించిన జైలు అధికారులు.. ఆయన్ను దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆయన పరిస్థితి విషమించడంతో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (ఎల్‌ఎన్‌జేపీ) ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స పొందించారు. జైన్ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. ఆరు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
TS News: భారాసకు రంగారెడ్డి జిల్లా డీసీసీబీ ఛైర్మన్ గుడ్‌బై
-
Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి బస్సు యాత్రకు ఏర్పాట్లు?
-
Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం