ప్రజాస్వామ్య సంప్రదాయాలు.. ఆధునికతల మేళవింపు
దేశ రాజధానిలో ఆదివారం ఆవిష్కృతమైన పార్లమెంటు కొత్త భవనం దేశ ఘన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆధునికతలను అద్దుకుని రాజసంగా అలరారుతోంది.
పార్లమెంటు కొత్త భవన విశేషం
దిల్లీ: దేశ రాజధానిలో ఆదివారం ఆవిష్కృతమైన పార్లమెంటు కొత్త భవనం దేశ ఘన ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఆధునికతలను అద్దుకుని రాజసంగా అలరారుతోంది. వేదకాలం నుంచి ఈ నాటి వరకూ దేశంలో అమలైన ప్రజాస్వామ్య విధానాలను, అవి పరిఢవిల్లిన విశిష్ఠతలను చాటిచెబుతోంది. పార్లమెంటు భవనంలో ప్రత్యేకంగా నిలిచిన రాజ్యాంగ మందిరంలో ఏర్పాటు చేసిన వరుస చిత్రాలు దీనిని స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ రాజ్యాంగ మందిరాన్ని హిందూ సంప్రదాయాల్లో ఆరాధించే, స్వచ్ఛ శక్తికి నిదర్శనంగా భావించే శ్రీయంత్రం స్ఫూర్తిగా రూపొందించారు. ఇక్కడే ఆధునికతకు ప్రతిరూపంగా డిజిటల్‌్ రూపంలోకి మార్చిన భారత రాజ్యాంగాన్ని ఉంచారు. ఇంకా భూభ్రమణానికి ప్రతీకగా ఫుకో పెండ్యులమ్‌ను త్రికోణాకారపు హాలు పై భాగంలో అమర్చారు. పార్లమెంటు వ్యవహారాలను ప్రభావశీలంగా నిర్వహించేందుకు లోక్‌సభ, రాజ్యసభల్లో సుస్పష్టమైన ధ్వని-దృశ్య, ఆధునిక ఓటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. భవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ వేదికలపై మహాత్మాగాంధీ, చాణక్య, గార్గి, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, బి.ఆర్.అంబేడ్కర్, కోణార్క్ సూర్యదేవాలయ రథ చక్రం ఇత్తడి చిత్రాలను అలంకరించారు. సంగీత, స్తపత్య, నిర్మాణ, శిల్ప గ్యాలరీలు ఆయా శాస్త్రాలను ప్రతిబింబిస్తున్నాయి. కొత్త భవనంలో పెయింటింగ్స్, రాతి విగ్రహాలు, కుడ్య చిత్రాలు, లోహ ప్రతిమలు మొదలైన 5,000 ఆర్ట్‌వర్క్స్‌ను అమర్చారు. దేశంలోని ప్రఖ్యాత కళాకారులైన ఉస్తాద్ అంజాద్ అలీ ఖాన్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, పండిత్ రవిశంకర్.. వారి కుటుంబ సభ్యులు వారి సంగీత వాద్యాలను సంగీత గ్యాలరీ కోసం వితరణ చేశారని అధికారులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Smile Pinki: ఆస్కార్ విజేత పింకీ ఇంటికి కూల్చివేత నోటీసులు
-
Kantara: ‘కాంతార’కు ఏడాది.. నిర్మాణ సంస్థ స్పెషల్ పోస్ట్
-
Vijayawada: విద్యార్థుల అరెస్ట్.. రణరంగంగా మారిన ధర్నా చౌక్
-
Palak Gulia: సరదాగా మొదలుపెట్టి.. షూటింగ్లో స్వర్ణం నెగ్గి
-
45 గంటల బ్యాటరీ లైఫ్‌తో ₹1699కే నాయిస్ కొత్త ఇయర్‌బడ్స్.. ఫీచర్లు ఇవే!
-
KTR: ఎన్టీఆర్ శిష్యుడిగా కేసీఆర్ తెలంగాణ అస్తిత్వాన్ని చాటారు: కేటీఆర్