ఉజ్జయిని మహాకాలేశ్వర్‌లో కూలిన విగ్రహాలు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయ ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి.
విచారణకు కాంగ్రెస్ డిమాండ్
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాలేశ్వర్ ఆలయ ఆవరణలో ఆర్నెల్ల కిందట ప్రతిష్ఠించిన సప్తరుషుల విగ్రహాల్లో ఆరు విగ్రహాలు ఆదివారం సాయంత్రం ఈదురుగాలుల ధాటికి కూలిపోయాయి. ఒక్కో విగ్రహం పది అడుగుల ఎత్తుతో ఉంటుంది. ఆ సమయంలో సందర్శకులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నా ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. గతేడాది అక్టోబరులో రూ.856 కోట్ల ఈ మహాకాల్ లోక్ కారిడార్ ప్రాజెక్టు మొదటిదశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణపనుల్లో జరిగిన అవినీతి కారణంగానే విగ్రహాలు కూలాయని, దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి విచారణ జరిపించాలని కోరుతూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమలనాథ్ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: హైదరాబాద్లో పలుచోట్ల ఐటీ సోదాలు
-
TDP: ఎవరెస్ట్ వద్ద ఎగిరిన పసుపుజెండా
-
Justice Lakshmana Reddy: జస్టిస్ లక్ష్మణరెడ్డి అరుదైన రికార్డు
-
మీ వాళ్లు కబ్జా చేస్తే.. మీరు సెటిల్మెంట్ చేశారు: ఆదోని ఎమ్మెల్యే కుమారుడిని చుట్టుముట్టిన జనం
-
‘భువనేశ్వరిని అసెంబ్లీ సాక్షిగా అవమానించినప్పుడు ఏం చేశారు?’
-
AP News: హోం మంత్రి వస్తే ఊరొదిలి వెళ్లాలా?