నిలకడగా మనోహర్‌ జోషి ఆరోగ్యం

మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మనోహర్‌ జోషి(85) ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన కుమారుడు ఉన్మేష్‌ జోషి ఆదివారం తెలిపారు.

Published : 29 May 2023 05:23 IST

ముంబయి: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మనోహర్‌ జోషి(85) ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు ఆయన కుమారుడు ఉన్మేష్‌ జోషి ఆదివారం తెలిపారు. మెదడులో రక్త స్రావం కావడంతో మనోహర్‌ జోషి ఈ నెల 22న ముంబయిలోని పి.డి.హిందుజా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జోషి ఐసీయూలోనే ఉన్నారని.. వెంటిలేటర్‌ మీద లేరని వైద్యులు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని