పాక్‌ డ్రోన్‌ను కూల్చేసిన బీఎస్‌ఎఫ్‌ దళాలు

పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌న్‌ బీఎస్‌ఎఫ్‌ దళాలు ఆదివారం కూల్చివేశాయి.

Published : 29 May 2023 05:23 IST

అమృత్‌సర్‌: పంజాబ్‌లోని భారత్‌-పాక్‌ సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్‌న్‌ బీఎస్‌ఎఫ్‌ దళాలు ఆదివారం కూల్చివేశాయి. ఆదివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో అమృత్‌సర్‌ జిల్లా దనోయ్‌ ఖుర్ద్‌ గ్రామంలో డ్రోన్‌ సంచరించడాన్ని గుర్తించినట్లు బీఎస్‌ఎఫ్‌ ఉన్నతాధికారులు తెలిపారు. వెంటనే దాన్ని కూల్చివేసినట్లు పేర్కొన్నారు. పంట పొలాల్లో పడి ఉన్న డ్రోన్‌ శకలాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.  అయితే.. పారిపోతున్న ముగ్గురు అనుమానితుల్లో ఒకరిని అరెస్టు చేశామని.. అతడి నుంచి 3.4 కిలోల మాదక ద్రవ్యాల సంచిని స్వాధీన పరచుకున్నట్లు బీఎస్‌ఎఫ్‌ దళాలు ప్రకటించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని