దిల్లీ చేరిన కంబోడియా రాజు

కంబోడియా రాజు నరోదమ్‌ సిహమోని మన దేశ పర్యటనకు గాను సోమవారం దిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ ఆయనకు పాలం వాయు సేన స్థావరంలో ఘనంగా స్వాగతం చెప్పారు.

Published : 30 May 2023 05:27 IST

దిల్లీ: కంబోడియా రాజు నరోదమ్‌ సిహమోని మన దేశ పర్యటనకు గాను సోమవారం దిల్లీ చేరుకున్నారు. విదేశాంగ సహాయ మంత్రి రాజ్‌కుమార్‌ రంజన్‌ సింగ్‌ ఆయనకు పాలం వాయు సేన స్థావరంలో ఘనంగా స్వాగతం చెప్పారు. 1952లో మొదలైన భారత్‌-కంబోడియా దౌత్య సంబంధాలకు 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిహమోని భారత సందర్శనకు వచ్చారు. 1963లో సిహమోని తండ్రి నరోదమ్‌ సిహనౌక్‌ భారత్‌ను సందర్శించిన తరవాత కంబోడియా రాజు మళ్లీ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. మంగళవారం సిహమోనికి భారత రాష్ట్రపతి భవనంలో అధికార లాంఛనాలతో స్వాగతం పలుకుతారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్రమోదీలతో ఆయన చర్చలు జరుపుతారు. ఉపాధ్యక్షుడు జగదీప్‌ ధన్‌ఖడ్‌, విదేశాంగమంత్రి ఎస్‌.జైశంకర్‌లు కంబోడియా రాజును కలుసుకొంటారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని