యాసిన్‌ మాలిక్‌కు దిల్లీ హైకోర్టు నోటీసులు

యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు మరణశిక్ష విధించాలన్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యర్థనపై.. అతడికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

Published : 30 May 2023 05:17 IST

మరణశిక్ష విధించాలన్న ఎన్‌ఐఏ అభ్యర్థనపై విచారణ

దిల్లీ: యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు మరణశిక్ష విధించాలన్న జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అభ్యర్థనపై.. అతడికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 9న తమ ముందు హాజరు కావాలని జస్టిస్‌ సిద్ధార్థ్‌ మృదుల్‌, జస్టిస్‌ తల్వంత్‌సింగ్‌లతో కూడిన ధర్మాసనం యాసిన్‌ మాలిక్‌కు సోమవారం వారెంట్‌ జారీ చేసింది. ఉగ్రవాద, వేర్పాటువాద చర్యల్లో యాసిన్‌ భాగస్వామి అని, ఈ కేసును అత్యంత అరుదైనదిగా భావించి అతడికి మరణశిక్ష విధించాలని ఎన్‌ఐఏ తరఫున వాదించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ధర్మాసనానికి విన్నవించారు. ఎన్‌ఐఏ వాదనలు విన్న ధర్మాసనం మాలిక్‌కు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని