Women safety device: మహిళల రక్షణకు ఎలక్ట్రిక్‌ చెప్పులు

మహిళల రక్షణ కోసం ఎలక్ట్రిక్‌ చెప్పులను రూపొందించాడు ఝార్ఖండ్‌లోని ఛత్రాకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి. ‘విమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ పేరుతో మంజీత్‌ కుమార్‌ వీటిని తయారు చేశాడు.

Updated : 30 May 2023 13:22 IST

తయారు చేసిన ఝార్ఖండ్‌ యువకుడు

మహిళల రక్షణ కోసం ఎలక్ట్రిక్‌ చెప్పులను రూపొందించాడు ఝార్ఖండ్‌లోని ఛత్రాకు చెందిన ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి. ‘విమెన్‌ సేఫ్టీ డివైజ్‌’ పేరుతో మంజీత్‌ కుమార్‌ వీటిని తయారు చేశాడు. ‘‘మహిళలు, బాలికలకు వేధింపులు ఎదురైన సమయంలో ఎలక్ట్రిక్‌ చెప్పులతో పోకిరీలను తంతే కరెంట్‌ షాక్‌ తగిలి అక్కడే కిందపడిపోతారు. దీంతో ఇతరుల సాయం కోరకుండానే వారిని వారు కాపాడుకునే అవకాశం వీటితో ఉంటుంది’’ అని మంజీత్‌ పేర్కొన్నారు. సాధారణంగా మనం వేసుకునే చెప్పులనే ముడిసరుకుగా తీసుకుని అందులోని కింది భాగంలో నాలుగు బ్యాటరీలు, స్విచ్‌ సహా మరికొన్ని చిన్న పరికరాలను అమర్చాడు. ఈ డివైజ్‌కు ఒక అరగంట ఛార్జింగ్‌ పెడితే రెండు రోజుల వరకు తిరగొచ్చు. కేవలం రూ.500లకే ఈ డివైజ్‌ను తయారు చేయడం విశేషం. ఇందుకోసం మంజీత్‌ వారం సమయం తీసుకున్నాడు. నిర్భయ వంటి ఘటన మళ్లీ పునరావృత్తం కాకుండా ఉండేందుకు మహిళల రక్షణ కోసం దీనిని రూపొందించానని చెప్పారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని