‘2024’ పద్మ పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం
వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించింది.
ఈనాడు, దిల్లీ: వచ్చే ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం కేంద్ర ప్రభుత్వం నామినేషన్లను ఆహ్వానించింది. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలన్న స్ఫూర్తితో పని చేసే సామాజిక సేవా కార్యకర్తల పేర్లను పీపుల్స్ పద్మ 2024కి నామినేట్ చేయాలని తెలిపింది. సెప్టెంబరు 15లోపు నామినేషన్లను https://awards.gov.in పోర్టల్‌కు ఆన్‌లైన్ ద్వారా పంపాలని సూచించింది. కళలు, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం- పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, సివిల్ సర్వీస్, క్రీడలు, ఆధ్యాత్మికం, యోగా, వన్యప్రాణుల రక్షణ, వ్యవసాయం, క్షేత్రస్థాయి నవకల్పనలు, ఆర్కియాలజీ, ఆర్కిటెక్చర్ లాంటి రంగాల్లో నిస్వార్థంగా సేవలందిస్తున్న వారి పేర్లను నామినేట్ చేయొచ్చని కేంద్రం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్‌పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్‌బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ