ప్రతి నిర్ణయం ప్రజల కోసమే: మోదీ

ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న తీవ్ర కాంక్షే తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపిందని ప్రధాని మోదీ అన్నారు.

Updated : 31 May 2023 04:34 IST

వారి జీవితాలను మెరుగుపరచాలనేదే  నా ఆకాంక్ష
అదే ముందుకు  నడిపిస్తోంది: మోదీ

దిల్లీ: ప్రజల జీవితాలను మెరుగుపరచాలన్న తీవ్ర కాంక్షే తాను తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ముందుకు నడిపిందని ప్రధాని మోదీ అన్నారు. ఆయన నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం కొలువుదీరి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను మార్చడానికి మరింత కష్టపడి పనిచేస్తామని చెప్పారు. ‘ఈ తొమ్మిది సంవత్సరాలుగా పేదవారి గౌరవం, జీవన ప్రమాణాలను పెంచడానికే పరితపించాం. అనేక కార్యక్రమాల ద్వారా కొన్ని లక్షలమంది జీవితాలను మార్చివేశాం. వినమ్రత, కృతజ్ఞత భావంతో ఈ ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది’ అని పేర్కొన్నారు.

మోదీ సభతో కార్యక్రమాలు షురూ

కేంద్రంలో అధికారంలోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా భాజపా నెలరోజుల పాటు భారీ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనుంది. బుధవారం రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో జరగబోయే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగంతో ఈ కార్యక్రమం పూర్తిస్థాయిలో మొదలవుతుంది.  

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని