ఎయిరిండియా సిబ్బందిపై చేయిచేసుకున్న ప్రయాణికుడు
సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు వారిలో ఒకరిపై చేయిచేసుకున్న ప్రయాణికుడిని ఎయిరిండియా ప్రతినిధులు దిల్లీ విమానాశ్రయంలో భద్రత సిబ్బందికి అప్పగించారు.
దిల్లీ: సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతోపాటు వారిలో ఒకరిపై చేయిచేసుకున్న ప్రయాణికుడిని ఎయిరిండియా ప్రతినిధులు దిల్లీ విమానాశ్రయంలో భద్రత సిబ్బందికి అప్పగించారు. గోవా నుంచి దిల్లీ వస్తున్న విమానంలో సోమవారం చోటు చేసుకున్న ఘటనపై విచారణ కూడా మొదలైంది. ‘విమానంలో ఓ ప్రయాణికుడు తొలుత సిబ్బందిని దూషించాడు. తర్వాత భౌతిక దాడికి పాల్పడ్డాడు. విమానం దిల్లీకి చేరుకున్న తర్వాత కూడా దుందుడుకు చర్యని ఆపలేదు’ అని ఎయిరిండియా ప్రతినిధి ఒకరు తెలిపారు. సిబ్బంది, ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని చెప్పారు. విమానంలో దౌర్జన్యానికి పాల్పడేవారిని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని ఎయిరిండియా సీఈవో, ఎండీ కాంప్‌బెల్ విల్సన్ స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: హడలెత్తించిన నేపాల్.. ఉత్కంఠ పోరులో భారత్‌దే విజయం
-
NewsClick: మళ్లీ తెరపైకి ‘న్యూస్‌క్లిక్’ వివాదం.. ఆఫీసు, జర్నలిస్టుల ఇళ్లల్లో సోదాలు
-
Nimmagadda Prasad: మళ్లీ ఔషధ రంగంలోకి నిమ్మగడ్డ ప్రసాద్
-
Stock Market: నష్టాలతో ప్రారంభమైన మార్కెట్ సూచీలు.. 19,550 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’