ఫోన్‌ కోసం రిజర్వాయర్‌ తోడించిన అధికారి జీతం నుంచి బిల్లు కోత

ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల రూ.లక్ష విలువ చేసే సెల్‌ఫోను నీటిలో పడిందని ఖేర్‌కట్టా రిజర్వాయరు నీటిని బయటకు తోడించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసిన ఉన్నతాధికారులు.

Published : 31 May 2023 03:58 IST

త్తీస్‌గఢ్‌లో ఇటీవల రూ.లక్ష విలువ చేసే సెల్‌ఫోను నీటిలో పడిందని ఖేర్‌కట్టా రిజర్వాయరు నీటిని బయటకు తోడించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌పై సస్పెన్షన్‌ వేటు వేసిన ఉన్నతాధికారులు.. 4,104 క్యూబిక్‌ మీటర్ల నీటిని వృథా చేసినందుకు ఆ అధికారి జీతం నుంచి రూ.53,092 వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాంకేర్‌ జిల్లా ఫుడ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజేశ్‌ విశ్వాస్‌ మే 21న మిత్రులతో కలిసి విహారయాత్రగా వెళ్లి, సరదాగా సెల్ఫీ తీసుకొంటూ ఉండగా ఫోను చేజారి రిజర్వాయరులో పడిపోయిన విషయం తెలిసిందే. రెండు భారీ మోటార్లతో మూడు రోజులు శ్రమించి నీళ్లను బయటకు తోడారు. దొరికిన ఫోను పనిచేయకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. డ్యామ్‌ ఖాళీ చేయించేందుకు మౌఖిక అనుమతులు ఇచ్చిన జలవనరుల శాఖ ఎస్‌డీవో ధివర్‌పైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు