దిల్లీలో బయటపడ్డ 2,500 ఏళ్లనాటి అవశేషాలు

దేశ రాజధాని దిల్లీలోని పురానా ఖిల్లాలో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో 2,500 ఏళ్ల కిందటి  ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.

Updated : 31 May 2023 04:26 IST

ఈనాడు, దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని పురానా ఖిల్లాలో భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన తవ్వకాల్లో 2,500 ఏళ్ల కిందటి  ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. మౌర్యుల కాలానికి ముందు, తర్వాత 9 సాంస్కృతిక తరాలకు (కల్చరల్‌ లెవల్స్‌కు) సంబంధించిన ఆనవాళ్లు దొరికినట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ తవ్వకాలను కేంద్ర మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పురానా ఖిల్లా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న చోటును ‘ఇంద్రప్రస్థ స్థలం’ గా గుర్తించినట్లు వెల్లడించారు. మౌర్యులకు ముందు, మౌర్యుల కాలం, శుంగులు, కుషాణులు, గుప్తులు, గుప్తుల తర్వాత, రాజ్‌పూత్‌లు, సుల్తానులు, మొగలుల కాలం వరకు మొత్తం 9 తరాల ఆనవాళ్లు లభించాయన్నారు. దిల్లీ రాజధాని ప్రాంతంలో జరిపిన తవ్వకాల్లో మౌర్యులకు ముందు కాలం నుంచి మొగలుల వరకు చారిత్రక ఆనవాళ్లు బహిర్గతమైన ఏకైక ప్రాంతం ఇదేనని కేంద్ర మంత్రి వెల్లడించారు. 2,500 ఏళ్ల క్రితం నాటి మానవ నివాస ప్రాంతాలు, జీవన అస్తిత్వానికి సంబంధించిన ఆనవాళ్లు ఇందులో స్పష్టంగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. తవ్వకాలు జరిపిన ఓ చిన్న ప్రాంతం నుంచి 136 నాణేలు, 35 ముద్రలు, పరికరాలు లభించడం వల్ల ఈ ప్రాంతం ఒకప్పుడు వాణిజ్యానికి ముఖ్యమైన కేంద్రమని అర్థమవుతోందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని