150 వైద్య కళాశాలలకు గుర్తింపు రద్దు ముప్పు

అధ్యాపక సిబ్బంది తగినంతగా లేకపోవడంతోపాటు ఇతరత్రా నిబంధనలు పాటించని కారణంగా దేశంలోని 150 వైద్య కళాశాలలు గుర్తింపు రద్దు ప్రమాదం ముంగిట ఉన్నట్లు జాతీయ వైద్యమండలి (నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌) వర్గాలు తెలిపాయి.

Updated : 31 May 2023 06:18 IST

దిల్లీ: అధ్యాపక సిబ్బంది తగినంతగా లేకపోవడంతోపాటు ఇతరత్రా నిబంధనలు పాటించని కారణంగా దేశంలోని 150 వైద్య కళాశాలలు గుర్తింపు రద్దు ప్రమాదం ముంగిట ఉన్నట్లు జాతీయ వైద్యమండలి (నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌) వర్గాలు తెలిపాయి. గత రెండు నెలల్లో 30 వైద్య కళాశాలల గుర్తింపు రద్దు చేసి, సంబంధిత నిబంధనలు పాటిస్తున్నట్లుగా రుజువులు చూపాలని కోరినట్లు ఎన్‌ఎంసీ అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. గుజరాత్‌, అస్సాం, పుదుచ్చేరి, తమిళనాడు, పంజాబ్‌, ఆంధ్రప్రదేశ్‌, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. కమిషన్‌ ఆధ్వర్యంలోని అండర్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు నెలకు పైగా ఆయా కళాశాలలను సందర్శించి సీసీ టీవీ ఫుటేజి, ఆధార్‌ అనుసంధాన బయోమెట్రిక్‌ హాజరు, అధ్యాపక హాజరు పట్టికలను పరిశీలించి లోపాలను గుర్తించాయి. ఈ చర్యలపై వైద్య కళాశాలలు 30 రోజుల్లోపు ఎన్‌ఎంసీకి అపీలు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని